Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 35

35
యద్‌ జ్ఞాత్వా న పునర్మోహమ్‌
ఏవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశేషేణ
ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ||

తాత్పర్యము : ఆత్మదర్శియైన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినపుడు ఆ జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సం భందించిన వారని చూడటం వలన నీవు ఎన్నడును ఇట్టి మోహమునకు గురికావు.

భాష్యము : గురువు నుండి జ్ఞానము పొందినవాడు, అన్ని జీవరాశులునూ దేవాది దేవుడైన శ్రీ కృష్ణుని అంశలుగా చూడగలుగుతాడు. నేను స్వతంత్రుడిని, నాకూ భగవంతునికి ఎటువంటి సంబంధము లేదు అని భావించేవారు మాయలో ఉన్నట్లే లెక్క. కొంతమంది తాత్వికులు కూడా కృష్ణున్ని ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తారే గాని అతడు పరబ్రహ్మ మని అర్ధము చేసుకోలేరు. సంపూర్ణజ్ఞానము ఏమిటంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అందరికీ ఆశ్రయమునిచ్చే శ్రేయోభిలాషి. దానిని మరచి జీవుడు స్వతంత్రుడనని భావించుటచే భౌతిక ప్రకృతి చే మోహము నొందుచున్నాడు. గురువు ద్వారా మాత్రమే లభించు ఈ జ్ఞానాన్ని పొందినట్లయితే, జీవుడు భగవంతునితో ‘సమానుడని’ గాని, ‘స్వతంత్రుడని’ గాని అనే భావము నుండి బయటపడగలడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement