ఓ రోజు శ్రీరామచంద్రుడు, సీతాదేవి తమ మందిరంలో కూర్చుని ఉన్నారు. సీతాదేవి ఉన్నట్టు వుండి రాములవారితో ఇలా అంది. ”హనుమ రోజూ ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటు న్నాడో లేదో! అతనికి ఎవరు భోజనం పెడుతున్నారో! ఈరోజు హనుమను భోజనానికి పిలుస్తాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని వడ్డించి, కడుపు నిండా తినిపిస్తాను” ఎంతో అభిమానంతో ప్రేమగా అంది సీతమ్మతల్లి. ఆమె మాటలకు శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వా డు. ఆయన నవ్వు చూసిన సీతమ్మ ”ఎందు కు స్వామీ! ఆ చిద్విలాసం”అంది.
”ఏమీ లేదు దేవీ! హనుమను భోజ నానికి పిలిచి కడుపునిండా తినిపిస్తాను అ న్నావు కదా. అందుకే. పిలువు… పిలువు నీకే అర్థమవుతుంది” అన్నాడు మందహాసంతో.
సీతమ్మ హనుమకు భోజనానికి రమ్మని కబురు పంపింది. వెంటనే ఆవిడే స్వయంగా రకరకా ల పదార్థాలను చేసింది. హనుమను పిలిచింది. ఆయన వచ్చి శ్రీరామచంద్రుడుకి సీతమ్మకు నమస్కరించి కూర్చున్నాడు.
సీతమ్మ తల్లి ఆయన పక్కనే కూర్చుని పదార్థాలను వడ్డిం చింది. ”కడుపునిండా తిను నాయనా… ఎప్పుడు తిన్నావో ఏమో… మొహమాటపడకు” అని చెప్పింది.
”సరేనమ్మా” అని చెప్పి హనుమ తలవంచుకుని భోజ నం చేయసాగాడు. సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది. హనుమ వద్దు అనకుండా…. వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తిం టున్నాడు. కాసేపట్లో సీతమ్మ చేసిన వంటంతా అయిపోయిం ది. సీతమ్మ కంగారుపడి అం:తపుర వాసులకై వండిన పదా ర్థాలను తెప్పించింది. అవీ అయిపోయాయి. తలవంచుకునే ఆహారానికై నిరీక్షిస్తున్నాడు శ్రీరామదూత హనుమంతుడు.
సీతమ్మకి కంగారు పుట్టింది. ఏమిచేయాలో తోచలేదు. ఆలోచించింది. చివరకు హనుమనే ”రోజూ ఏం తిం టున్నావు నాయనా…” అడిగింది వినయంగా.
”రామ నామం తల్లిd…” వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీత మ్మ త్రుళ్లిపడింది. నిరంతరం రామనా మం భుజించేవాడు… భజించేవాడు… శివుడొక్కడే గదా అనుకుంది. సీతమ్మతల్లి తేరిపార జూసింది. అపుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు. శంకరుడే హనుమ. అప్పుడు అర్థమైంది. నిత్యం రామ నామం ఆహారంగా స్వీకరించేవాడికి… తాను మరి ఏమి పెట్టగలదు! వెంటనే సీతమ్మ ఒక అన్నపు ముద్దను పట్టుకుని… కళ్లు మూసు కుని ”రామార్పణం” అని రాముడిని ప్రార్థించి… ఆ ముద్దను హనుమకు వడ్డించింది. ఆ ముద్దని భక్తితో కళ్లకు అద్దుకొని స్వీకరించి… ”అన్నదాత సుఖీభవ” అన్నాడు హను మంతుడు తృప్తిగా. హనుమలోని శంకరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి.
హనుమ కడుపు నింపే ఆహారం!
Advertisement
తాజా వార్తలు
Advertisement