Saturday, November 23, 2024

Followup – ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సలైట్స్ హతం – వివరాలు వెల్లడించిన పోలీసులు

చింతూరు, (ఏఎస్‌ఆర్‌ జిల్లా), నవరంబర్‌22, (ఆంధ్రప్రభ),: ఆంధ్రా సరిహద్దు రాష్ట్రమైన చత్తీష్‌ఘడ్‌లోని బస్తర్‌ డివిజన్‌లో గల భెజ్జీ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం డీఆర్జీ జవాన్లు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌లో యాంటీ- నక్సల్స్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొంటా బ్లాక్‌లోని భెజ్జీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం పోలీస్‌ శాఖకు వచ్చింది. ఈ సమాచారం మేరకు పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఆర్‌జీ జవాన్లు బెజ్జీ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు.

ఈ తరుణంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారస పడటం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పులలో 10 మావోయిస్టులు హతమయినట్లు అక్కడ పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో మృతి చెందిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలు సంఘటన స్థలంలో లభ్యమయ్యాయి. జవాన్లు మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు..

- Advertisement -

ఒడిశా మీదుగా చత్తీష్‌ఘఢ్‌లోకి ప్రవేశించిన క్రమంలో మావోయిస్టులు ఒడిశా రాష్ట్రం నుండి ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తున్నారనే సమాచారం చత్తీష్‌ఘడ్‌ పోలీసులకు అందింది. ఈ సమాచారంతో పోలీస్‌ బలగాలు అప్రమత్తమై మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందకు సన్నద్దమై భద్రతా బలగాలకు అడవుల బాట పట్టాయి.

అడవులను జల్లేడ పట్టే క్రమంలో సుక్మా జిల్లాలోని కుంటా, కిస్టారం ఏరియా కమిటీ-కి చెందిన మావోయిస్టులపై నిఘా పెడుతూ బలగాలు బయలుదేరాయి. ఈ తరుణంలో సుక్మాలోని భెజ్జీ కొండల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు

చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా అందులో 7 గురు పురుష మావోయిస్టులు కాగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన కొంతమంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ఇలా గుర్తించిన వారిలో డీవీసీఎం కమిటీకి చెందిన దూది మాసా, మద్వి లక్మా, ఏసీఎం క్యాడెర్‌కి చెందిన డోరో కోసి, కుంజమ్‌ బమన్‌, కతం కోసా, పీఎల్‌జీఏ 8 వ కమాండర్‌ దూది హుంగి (దూది మాసా భార్య)లగా గుర్తించారు. మృతి చెందిన మరో నలుగురు మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.

.ఏకే 47 తో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం

ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతమవ్వగా మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను డీఆర్‌జీ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఏకే 47తో పాటు మూడు ఆటోమేటిక్‌ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌ నేపధ్యంలో చత్తీష్‌ఘడ్‌ రాష్ట్ర హోంమంత్రి విజయ్‌ శర్మ స్పందించి మాట్లాడుతూ 10 మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశారని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటీ వరకు మొత్తం 212 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని పేర్కోన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జవాన్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement