Saturday, December 28, 2024

AP | డ్రోన్‌ షోకు ఐదు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా నది తీరంలో నిర్వ#హంచిన డ్రోన్‌ షో అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం పున్నమి ఘాట్‌ వేదికగా జరిగిన ఈ డ్రోన్‌ షోకి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

కాగా, 5,500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనను తొలిసారిగా నిర్వహించారు. దీంతో డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఈ సందర్భంగా డ్రోన్ షో అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్లను అందజేశారు.

డ్రోన్‌ షో అందుకున్న ఐదు రికార్డులు..

లార్జెస్ట్‌ ప్లానెట్‌ ఆకృతి.
నదీ తీరాన లార్జెస్ట్‌ ల్యాండ్‌మార్క్‌.
అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి.
అతిపెద్ద ఏరియల్‌ లోగో ఆకృతి.
అతిపెద్ద విమానాకృతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement