Sunday, November 24, 2024

కురుక్షేత్రంలో అంతరించిన ఐదు తరాలు!

మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది. సుమారు వందల పాత్రలు మనకు కనిపిస్తాయి. సంస్కృ త మూలం (వ్యాస విరిచితం)లో లక్షకు పైగా శ్లోకాలు ఉన్నా యి. కవిత్రయం వారి ఆంధ్ర మహాభారతంలో సుమారు 21,5000 పద్య గద్యలు ఉన్నాయి. ఆంధ్ర మహాభారతం ప్రకారం శత శృంగ పర్వతం నుండి హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజుకు 16 ఏళ్ళు, భీమునికి 15, అర్జునునకు 14, కవలలైన భరత-శతృఘ్న లకు- 13 సంవత్సరాలని తెలుస్తుంది. భీముడు- దుర్యో ధనుడు ఒకే రోజున జన్మించారు కనుక యిరువురి వయస్సు ఒక్కటే.
కృపాచార్యులు అనంతరం ద్రోణాచార్యుల వద్ద విలువిద్య అభ్యసించిన కాలం 13 సంవత్సరాలట. అంటే విలు విద్య ముగిసే నాటికి ధర్మరాజు వయస్సు 29 సంవత్సరాలు. లక్కయింటిలోను, ఏకచక్రపురంలోను కలిసి సంవత్సర కాలం ఉన్నారు అనుకుంటే ధర్మరాజు వయసు 30.
ద్రౌపతిని వివాహం చేసుకుని పాండవులు ద్రుపదు ని ఇంట సంవత్సరం ఉన్నారట అంటే ధర్మరాజుకు 31 వయసు. అనంతరం హస్తినకు వచ్చి 5 సంవత్సరాలు ఉమ్మడిగా జీవించారట. అంటే ధర్మరాజు వయస్సు 36. పిమ్మట రాజ్యం పంచుకుని ఇంద్రప్రస్ధపురం విశ్వకర్మచే నిర్మించుకొని 23 సంవత్సరాలు రాజ్యపాలన చేసారని సభాపర్వం చెపుతుంది. అంటే 36్శ23్స 59. పన్నెండేళ్ళు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం 59్శ13్స 72 సంవత్సరాల వయసు ధర్మరాజుది. అతనికంటే కర్ణుడు దాదాపు 7 లేక 8 సంవత్సరాల పెద్దవాడు. మహాభారత సంగ్రా మం నాటికి ధర్మరాజు వయసు 72 అంటే అతని పితామహుడు అయిన భీష్ముని వయసు ఎంత? దాదాపు 150 నుండి 180 వరకు ఉండాలి. భీష్ముని తమ్ముడు బాహ్లీ కుడు వయస్సు కూడా దాదాపుగా అంతే ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామంలో ధృతరాష్ట్రుని 1. పితామ#హుడు 2. పిత, 3. భ్రాతృడు, 4. పుత్రుడు. 5. పౌత్రుడు అనే 5 తరాలు అంతరించాయి.
వివస్వతుడు ద్వాదశాదీత్యుల్లో ఒకడు, యితని తండ్రి కస్యపుడు తల్లి అదితి. ఇతన్నే సూర్యుడు అని కూడా అంటారు. ఇతను విశ్వకర్మ కుమాలగు సంజ్ఞాదేవి, ఛాయాదేవిలను వివాహం చేసుకున్నాడు. ఇతనికి, వైవస్వతుడు (ఇతను మనువు) యముడు, శని, అనే ముగ్గురు పుత్రులు, యమున, తపతి అనే ఇరువురు కుమార్తెలు జన్మించారు.
వైవస్వతునికి శ్రాద్ధ దేవుడనే పేరు కూడా ఉంది. భార్య శ్రధ. వీరికి ఇక్ష్మావాకుడు, నృగుడు, శర్యాతి, దిషుడు, ధృష్టుడు, కరూశుడు, నరిష్యంతుడు, వృషద్రుడు, నభ గుడు, కవి అనే పదిమంది పుత్రులు జన్మించారు వీరిలో కవి అనువాడు బాల్యంలోనే మరణించాడు. ఇతని పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడు, అతని కుమారుడు కుక్షి అతని తమ్ముడు నిమి ఈ ఇక్ష్వాక వంశం వారి రాజధాని అయోధ్య. వైవస్వతుని పుత్రుల్లో కురూశుడు కురూశ వంశానికి మూలపురుషుడు.
సంతతి కలగక ముందు వైవస్వతుడు యాగం చేసి తమకు పుత్రుడు కావాలని వసిష్ఠుని వేడుకోగా ”సుద్యుమ్నుడు” అనే కుమారుడిని ప్రసాదించాడు. అలా జన్మిం చి పెరిగి పెద్దవాడైన సుద్యుమ్నుడు ఓ పర్యాయం వేటకు వెళ్ళి శరవణవనం లోనికి వెళ్ళాడు. ఆ వనంలో ప్రవేశించిన పురుషులు ఎవరైనా స్త్రీగా మారిపోతారు అన్న కారణంగా అతను ”ఇల” అనే పేరు కలిగిన స్త్రీ రూపం పొందాడు. అలా సోముని కుమారుడైన బుధుని ద్వారా పురూరవుడు- అతని భార్య ఊర్వశి. వారికి ఆయువు భార్య స్వర్బాన. వారికి నహుషుడు- ప్రియంవద. వీరికి పూరుడు- కౌసల్య. వారికి జనమేజేయుడు- అనంత. వీరికి ప్రాచీశుడు- నశ్మి వారికి సంయాతి- వరాంగి. వారి కి న#హం యాతి- భానుమతి. వారికి సార్వభౌముడు- సునంద. వారికి జయత్సేను డు- సుశ్రవసు. వారికి అవాచినీడు- మర్యాద. వారికి నరిహుడు- నాంగి. వారికి మహోభౌముడు- పుష్టి. వారికి అయుతానీకుడు- కామా. వారికి అక్రోధనుడు- కాళంగి వారికి దేవతిధి- వైదేహ. వారికి ఋచీకుడు- నాంగి- లేక దేవ. వారికి ఋ క్షుడు- జ్వాల. వారికి. మతినారుడు- సరస్వతి. వారికి త్రసుడు- కాళింది. వారికి కిలు డు-రథంతరి. వారికి దుష్యంతుడు- శకుంతల. వారికి భరతుడు- సునంద వారికి భూమాన్యుడు- విజయ. వారికి సుహోత్రుడు- సువర్ణ. వారికి #హస్తి- యశోధర. వారికి వికుంఠనుడు- వసుదేవ. వారికి అజామీఢుడు కైకేయి. వారికి సంవరుణుడు- తపతి. వీరికి కురుడు (కురు వంశానికి మూల పురుషుడు) శుభాంగి. వీరికి విథూర ధుడు- మాధవి లేక సంప్రియ. వారికి. అనశ్వుడు- అమృత. వారికి పరిక్షిత్తు- సుయ శ. వారికి భీమసేనుడు- కుమారి. వారికి పరిశ్రవసుడు- వారికి ప్రతీపుడు- సునంద. వారికి శంతనుడు- గంగాదేవిలకు భీష్ముడు, సత్యవతికి చిత్రాంగదుడు- అంబిక. విచిత్ర వీరుడు- అంబాలిక. వీరికి ధృతరాష్ట్రుడు- పాండురాజు కలిగారు. ప్రతీపుడు యితను శిబి కుమార్తె అయిన సునందను వివాహం చేసుకున్నాడు. వారికి దేవాపి, శంతన, అనే ముగ్గురు పుత్రులు జన్మించారు. దేవాపి బాల్యంలోనే తపోధనుడుగా వనవాసం వెళ్ళాడు. శంతనుడు రాజయ్యాడు. అతనికి గంగాదేవికి భీష్ముడు జన్మించాడు. అనంతరం యొజనగంధి అయిన సత్యవతిని వివా#హం చేసు కోగా, చిత్రాంగద, విచిత్రవీర్యులు జన్మించారు. వీరిలో ఒకరు అదే పేరు కలిగిన గంధర్వ రాజు చేతిలో మరణించగా, మరొకరు క్షయవ్యాధికిలోనై సంతానం లేకనే మరణించారు. సంతానం కొరకు సత్యవతి తన కోడళ్ళు అయిన అంబిక, అంబాలికల కు దేవర న్యాయంగా కృష్ణ ద్వైపాయని వలన ధృతరాష్ట్ర, పాండురాజులు జన్మించా రు. అంబిక పరిచారిక యందు విదురుడు జన్మించాడు.
గాంధారికి వేదవ్యాస వరప్రసాదంగా నూరుగురు సంతతి జన్మించారు. కుంతి మాద్రిలకు పలు దేవతల వరాన పాండవులు జన్మించారు. ద్రౌపతికి పాండవులకు ప్రతివింధ్యుడు- శ్రుతసోముడు- శ్రుతకీర్తి- శతానీకుడ- శ్రుతసేనుడు అనే పుత్రులు జన్మించారు. అంతేకాకుండా ధర్మరాజునకు- దేవిక అనే భార్యకు ¸°ధేయుడు. భీముడు- జలంధరలకు సర్వంగుడు. #హడింభి యందు ఘటోత్కచుడు, అర్జున సుభద్రలకు అభిమన్యుడు. ఉలూపికి ఇరావంతుడు, చిత్రాంగదకు బబ్రువా#హను డు, నకులుడు-రేణుమతిలకు నిరామిత్రుడు, స#హదేవుడు- విజయలకు సుహోత్రు డు, అభిమన్యు ఉత్తరలకు పరీక్షిత్తుడు, ఇతనికి మద్రావతికి జనమేజయుడు జన్మించారు. జనమేజయుని భార్య వుపుష్టి.
శంతనుడి సోదరుడు బా#్లహకుడు. అతనికి సోమదత్తుడు, అతనికి భూరిశ్రవు డు, శలశల్యులనే ముగ్గురు జన్మించారు. మొదటితరంలో భీష్మ, బా#్లహకులు- రెండో తరంలో సోమదత్తుడు. మూడవతరంలో భూరి శ్రవుడు అతని సంతతి. నాల్గవత రంలో ధృతరాష్ట్ర- పాండు రాజుల సంతతి. ఐదవతరంలో లక్ష్మణ కుమారుడు- అభిమన్యుడు- ఉపపాండవులు- ఇరావంతుడు- ఘటోత్కచుడు.
పాండురాజు పౌత్రులలో చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడు తప్ప మిగిలిన 12 మంది కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement