Tuesday, December 24, 2024

AP | వరద బాధితులందరికీ ఆర్థిక సహాయం : కలెక్టర్ సృజన

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి ఇప్పటివరకు 1.71 లక్షల మంది లబ్ధిదార కుటుంబాలకు రూ.281 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు.

వివిధ సమస్యల కారణంగా పెండింగ్ లో ఉన్న 13వేల కుటుంబాలకు సంబంధించి వారి ఖాతాలను సరిచేసుకోవడం వల్ల దాదాపు 15 కోట్లు పరిహారాన్ని వారి ఖాతాలకు సోమవారం జమ చేశామని తెలిపారు.

ఖాతా మనుగడలో లేకపోవడం, బ్యాంకు ఖాతాకు మొబైల్ నెంబరు, ఆధార్ తో బ్యాంక్ ఖాతా అనుసంధానం, మరణించిన వారి పేరిట బ్యాంక్ ఖాతా ఉండడం, మైనర్ పేరిట ఉండడం తదితర కారణాలవల్ల పరిహారం అందజేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించామని, వాటిని 179 సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని… అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అర్హత ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement