హైదరాబాద్, (ప్రభ న్యూస్) : యూకేకు చెందిన డేటా అండ్ అనలిటిక్స్, ఈఆర్సీ స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ కగూల్ గచ్చిబౌలిలోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న కపిల్ టవర్స్ భవనంలో అదనపు కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసింది. తద్వారా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది. 200 మందికి పైగా ఉద్యోగులకు వసతి కల్పించే కొత్త 17,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కగూల్ సీఈఓ డాన్ బార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాన్ బార్లో మాట్లాడుతూ.. పెట్టు-బడులు, విస్తరణ, బెంచ్ బలాన్ని పెంచడంతో సహా భారతదేశం కోసం మేము ప్రకటించిన వ్యూహాత్మక వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నామని, పుణలో తమ కేంద్రాన్ని ప్రారంభించిన తరువాత హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ రెండు కేంద్రాల సాయంతో అంతర్జాతీయంగా డేటా అప్లికేషన్ల ఆధునికీకరణ, నిర్వహణ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా క్లయింట్ల డిమాండ్ పెరుగుతుందన్నారు. ఎనలిటిక్స్, ఏఐంఎల్, ఇంటిగ్రేషన్లు, ఎస్‌ఎఎస్ యాప్‌లు, ఈఆర్సీ, వెబ్ అప్లికేషన్లు, టెస్టింగ్ , ఏఎంఎస్ లాంటి రంగాల్లో ఉత్పత్తులు, సేవలను అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కగూల్ గ్రూప్ సీవోవో, సీఐఓ ప్రశాంత్ పటేల్, కగూల్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ గుప్తా బ్రహ్మాండపల్లి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.