—ఈ టోర్నమెంట్‌ను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తాం
—మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
బెల్లంపల్లి, : యువతలోని క్రీడాస్పూర్తిని వెలికితీసి జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎంపిక చేసేందుకు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 14నుంచి మండల స్థాయి, మున్సిపల్ స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహించారు, బెల్లంపల్లిలో జరిగిన రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాలో 392 జట్లు పాల్గొనడం జరిగిందని, ఇందులో 5వేలకు పైచిలుకు క్రీడాకారులు పాల్గొని వారి క్రీడా స్పూర్తిని, ప్రతిభను చాటడం జరిగిందని అన్నారు. అదేవిధంగా బెల్లంపల్లి మున్సిపల్ పోటీల్లో యువకులు ప్రతిభ కనబర్చి గెలుపొందిన వారిని అభినందించారు. అదేవిధంగా రానున్న వారం రోజుల్లో నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ లెవల్‌లో జరిగిన టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన 23వ వార్డు జట్టుకు రూ.75వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. రన్నర్‌గా నిలిచిన 8వ వార్డు జట్టుకు రూ.40వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. అదేవిధంగా సెమిఫైనల్‌కు చేరుకున్న 19, 11వ వార్డుల జట్లకు రూ.20వేల నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. అనంతరం బెల్లంపల్లిలోని సీనియర్ క్రీడాకారులను శాలువాలతో సన్మానించారు. ఇటీవల అంధుల క్రికెట్‌లో దేశం తరుపున ఆడిన మల్లెపల్లి సాయిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవికుమార్, పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, టీపీసీసీ సభ్యులు చిలుముల శంకర్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శవర్దన్‌రాజు, మాజీ కౌన్సిలర్లు రొడ్డ శారద, నాయకులు చిన్నరాజం, ఎనగందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.