న్యూఢిల్లి : ఇంజినీరింగ్ సొల్యూషన్స్ లీడింగ్ కంపెనీ ఎంటార్ టెక్నాలజీస్ బుధవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే.. క్యు4లో ఆపరేషన్స్ రెవెన్యూ రూ.78.1 కోట్ల నుంచి రూ.98.6 కోట్లకు (26.2 శాతం) పెరిగింది. అదేవిధంగా ఎబిడా చూసుకుంటే.. క్యు3లో రూ.22.8కోట్లు నమోదైతే.. క్యు4లో రూ.27.70 కోట్లకు (21.4 శాతం) పెరిగింది. పన్ను కంటే ముందు ప్రాఫిట్ చూసుకుంటే.. క్యు3లో రూ.18.7 కోట్లు నమోదైతే.. క్యు4లో రూ.23.8 కోట్లు (27.1 శాతం) వృద్ధి సాధించింది. పన్ను తరువాత ప్రాఫిట్ చూసుకుంటే.. క్యు3లో రూ.13.3 కోట్లు రికార్డయితే.. క్యు4లో రూ.19.8 కోట్లు (48.8 శాతం) వృద్ధి కనబర్చింది. 2020-21లోని క్యు4ని.. 2021-22 ఆర్థిక ఏడాదిలోని క్యు4తో పోలిస్తే.. రెవెన్యూలో 30.7 శాతం, ఎబిడాలో 13.6 శాతం, పన్నుకు ముందు లాభం 26.8 శాతం, పన్ను తరువాత లాభాలు 32.1 శాతం పెరిగాయి. ఎగుమతుల ఆధారంగా క్యు4లో రూ.197.80 కోట్లు సంపాధిస్తే.. గతేడాది క్యు4లో రూ.129.70 కోట్లు నమోదైంది. డొమెస్టిక్ రెవెన్యూలో కూడా ఈ ఏడాది క్యు4లో రూ.124.2 కోట్లు గడిస్తే..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..