ఛత్తీస్గఢ్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మరణించారు. భద్రతాబలగాల్లో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి కాలిలో బుల్లెట్ దిగగా, మరొకరికి తలలోకి వెళ్లింది. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భద్రతాబలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement