Friday, November 22, 2024

ఇంద్రకీలాద్రిపై బాలత్రిపుర సుందరిగా దుర్గమ్మ

సర్వశక్తిమయా సర్వమంగళా సద్గతి ప్రదా|
సర్వేశ్వరీ సర్వమయీ సర్వ మంత్ర స్వరూపిణీ||

శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ విదియ నాటి అవతారము బాలాత్రిపురసుందరి. ఈమెనే బ్ర#హ్మచా రిణి అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుకుంది. ఆమె కోరిక ప్రకారం #హమవం తునికి పుత్రికగా జన్మించింది. త్రిపురుని అర్థాంగి కావ టం వలన బాలాత్రిపురసుందరిగా కూడా పిలువబడే అమ్మ అక్షమాల మరియు అభయముద్రతో దర్శనమి స్తూ బుద్ధి, మనస్సు, చిత్తము, అ#హంకారము అణచి వేస్తుంది. శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో అధి దేవత కూడా త్రిపురసుందరీదేవి. త్రిపురములలో అంటే అన్ని లోకాలలో ఈ తల్లి సౌందర్యవతి గావున ఈ తల్లిని త్రిపు ర సుందరి అని పిలుస్తారు. షోడశ విద్య కొరకు సాధకు లు బాలా త్రిపురసుందరిని అర్చించాలి. ఆత్మ స్వరూపు రాలైన ఈ తల్లిని పూజిస్తే శివానుగ్ర#హము ద్వారా మోక్ష ము సంప్రాప్తిస్తుంది. షోడశ వర్షిణిగా పరిగణింపబడే ఈ తల్లి భండాసురుడు అనే రాక్షస సంహారము గావిం చి లోకాలకు శాంతిని చేకూర్చింది. లలితా త్రిశతి

స్తోత్రం అత్యంత ఫలదాయకము.
సాక్షాత్‌ ఆది పరాశక్తి, త్రిపుర సుందరీదేవి కుమార్తె గా శ్రీ విద్యాధి దేవతగా బ్రహ్మాండ పురాణం, లలితా మ#హత్మ్యం 26వ అధ్యాయంలో చెప్పబడింది. లలితా త్రిపుర సుందరి శ్రీ మహావిద్యలలో అగ్రగామి అభివర్ణిం చబడింది. బ్ర#హ్మ, విష్ణు, మ##హశ్వరులు పైనుండే అత్యున్నత స్పృ#హగా త్రిపుర నామం వర్ణించారు.
శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ,
చిదగ్ని కుండసమ్భూతా దేవకార్యసముద్యతా.
మంత్రజపం చేసుకునే ఉపాసకులు అనుసరించే బాలాత్రిపురసుందరి మూలమంత్రము.
ఐం క్లీం సౌ: సౌ: క్లీం ఐం
శ్రీశైలం దేవస్థానములో అమ్మవారు మయూర వా#హనంపై బ్ర#హ్మచారిణి రూపంలోను మరియు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని బాలాత్రిపురసుంద రి అవతారంలో అలంకరిస్తారు. రెండు అవతారాల పర మార్థము ఒక్కటే. పరమేశ్వరుని భర్తగా పొందేంత వర కు తల్లి బ్ర#హ్మచారిణిగా కొలువబడుతుంది. ఈ రోజు 9 సంవత్సరాలలోపు బాలికచే కుమారి పూజ చేయిస్తారు.
ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చి స్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. అమ్మవారిని ఆకుపచ్చ రం గు వస్త్రములతో అలంకరించి, గులాబీలతో అర్చిస్తే శుభ ప్రదము.

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలా|
దేవే ప్రసీదతు మయి బ్ర#హ్మచారిణ్యనుత్తమా||
ఈరోజు బాలాత్రిపురసుందరి… బ్ర#హ్మచారిణి రూపా లలో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరా ధించి, ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణకు పాత్రులగుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement