ఆంధ్రప్రభ స్మార్ట్, తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా) : తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న 10 మంది విద్యార్థినులకు నడక కష్టాలు తీరాయి. తాను మాట ఇచ్చిన పదిరోజుల్లోనే ఆ విద్యార్థుల కోరికను తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తీర్చారు. చిన్నతనంలో తాను చదువుకునేందుకు పడిన కష్టాలను గుర్తు చేసుకుని.. ఈ దుస్థితి ఈ తరానికి ఉండకూడదని ముందుగా తనవంతు సాయం చేశారు.
సమస్య విని.. చలించి..
వివరాల్లోకి వెళ్తే 10 రోజుల కిందట డిగ్రీ కాలేజీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆయనతో మాట్లాడుతూ.. తాము రాజుపేట హాస్టల్ లో చదువుతున్నామని, ప్రతీ రోజు రాను..పోను 6 కిలోమీటర్ లు నడుచుకుంటూ వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్య విన్న ఎమ్మెల్యే చలించిపోయారు. 10 రోజులలో సైకిల్స్ ఇస్తామని మాట ఇచ్చారు. ఈ మాటను శనివారం నెరవేర్చారు. ఆ 10 మంది విద్యార్థినులకు సైకిల్స్ అందచేశారు. థ్యాంక్యూ ఎమ్మెల్యే సార్.. థ్యాంక్ యూ వెరీమచ్ అంటూ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.