Tuesday, November 12, 2024

ధర్మం – మర్మం :

గంగా శివుని జటాజుటము నుండి బయటకు రావడానికి పార్వతి ప్రయత్నం (ఆడియోతో..)

శంకరుని జటాజుటము నుండి గంగను తీసుకువచ్చే విధానంలో పార్వతి ప్రయత్నం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మహేశ్వర భగవానుని జటాజుటంలోని ఉన్న జలమును గౌతమ మహర్షి, భగీరథుడు స్వీకరించిరి కాన జలము రెం డుగా బేధము పొందినది. గౌతమ మహర్షి వ్రతదాన సమాధులతో శంకరునిని ఆరాధించి శివ జటాజుటమున ఉన్న జలమును స్వీకరించెను. భగీరథుడు శంకరునిని ఆరాధించి తపస్సుతో, నియమములతో సంతోషింప చేసి జలమును స్వీకరించెను. ఈ విధంగా గంగా రెండు రూపములను పొందినది. గౌతమ మహర్షి మరియు సూర్యవంశపు క్షత్రియుడయిన భగీరథుడు ఏ కారణముతో శివ జటాజుటమున ఉన్న గంగను స్వీకరించెనని నారదుడు ప్రశ్నించగా దేవదేవుడైన శంకరునికి పార్వతి పత్ని అయినపుడు గంగ కూడా అవతరి ంచి శంకరునికి ప్రియురాలయ్యెనని బ్రహ్మదేవుడు వివరించెను. శంకరుడు బ్రహ్మ పాపాలను తొలగించుటకు గంగను ఆవిర్భవింప చేసెను. తదుపరి గంగా శంకరుని శిరమునే చేరినది. శివుడు రసికుడు, ప్రియుడు కావున రసవతి అయిన గంగా శంకరునికి అధిక ప్రీతిని కలిగించినది కావున శివుని శిరమున చేరినది. కారణాంతరమున శివుని జటాజుటం నుంచి బయటకు వచ్చిన గంగను చూసిన పార్వతి సహించలేక అసూయతో గంగను విడిచిపెట్టమని శంకరుని ప్రేరేపించెను. గంగను విడుచుబె ట్టుటకు శంకరుడు నిరాకరించగా నాథుడు ఉండి కూడా అనాథనని పార్వతి విలపించెననని నారదుడితో బ్రహ్మ పలికెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement