మారి సెల్వ రాజు దర్శకత్వంలో ధనుష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కర్ణన్. ఏప్రిల్ 9న ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థను వి క్రియేషన్స్ పై నిర్మించారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన మూడు పాటలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా అందులో ఒక పాట అయినా పండరాత్తి పురాణం వివాదాలకు దారితీసింది. ఈ పాటలో కొన్ని పదాలు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ కొందరు కోర్టుకెక్కారు.
దీంతో దర్శకుడు మారి సెల్వరాజ్ స్పందించి వివాదానికి తెరదించారు. పాటలోని పండరాత్తి పురాణం తో పాటు కొన్ని పదాలను మారుస్తున్నామని ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. దేవతలను ఏ పేరుతో పిలిస్తే ఏంటి… పేరు మారినంత మాత్రాన వారి ప్రభ తగ్గిపోతుందా? ఇక ఎమన్ కర్ణన్ ఆడేందుకు మంజనత్తి పురాణం పాడతారు.. కర్ణన్ ఆడుతారు… ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ మారి సెల్వన్ పేర్కొన్నారు.