రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు సాగించేవారి కోసం సోమవారం నుంచి ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి
తీసుకువస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆదివారం ఆయన విజయవాడలో కర్ఫ్యూ కొనసాగుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను విధిగా పాటించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయ
టకు రావాల్సి వస్తే తప్పని సరిగా రెండు మాస్కులు
ధరించడంతో పాటు శానిటైజర్‌ను వినియోగించాలనిసూచించారు.
స్వీయ జాగ్రత్తలు పాటించినప్పుడే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎటు వంటి రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులు లేవని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. శుభకార్యాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా స్థానిక అధికారుల అనుమతి తప్పని సరి అని వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 104, 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలతో పాటు లాక్ డౌన్ విధివిధానాలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను జప్తు చేయ
డంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు
జారీ చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ప్రభుత్వం
తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకునే బాధితులు స్టేషన్‌కు వెళ్లకుండా ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకుకర్ప్యూతో పాటు 144
సెక్షన్ అమలులో ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కర్ప్యూతో ప్రజలందరి నుంచి సహకారం అందుతుందని చెప్పారు.ప్రజల రక్షణ కోసం అనుక్షణం పోలీస్ శాఖ పనిచేస్తూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు నోటీసులు జారీ చేసిన అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజకీయాలకు ఇది సమయం కాదని వదంతులు ఎవరూ తీసుకురావొద్దని హితవు పలికారు. అందరూ బాధ్య తగా వ్యవహరించి ఈ కరోనా విపత్తు నుంచి బయట పడేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిర్ధారణ కాని వార్తలతో పాటు, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు.