Wednesday, December 4, 2024

Delhi – మ‌ళ్లీ రోడ్డెక్కిన రైతులు – నోయిడా నుంచి ఢిల్లీకి అన్నదాతల లాంగ్ మార్చ్

నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే దిగ్భంధం
10 కిలో మీట‌ర్ల మేర నిలిచిన ట్రాఫిక్
యుపి నుంచి ఢిల్లీ రాక‌పోక‌లు బంద్
స‌రిహ‌ద్దుల‌లోనే పోలీసులు అట‌కాయింపు

న్యూ ఢిల్లీ – ఉత్తరాదిలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం తమ భూములకు పరిహారం, ప్రయోజనాలు కోరుతూ ఢిల్లీకి బయలుదేరారు. యూపీలోని పలు ప్రాంతాల నుంచి బయలుదేరిన రైతుల్ని అడ్డుకోవడానికి కేంద్రం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను స‌రిహ‌ద్దుల‌లో మోహరించింది. రాజధాని ప్రాంతంలో పోలీసులు భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ ఎత్తున రోడ్లపై మోహరించారు

- Advertisement -

కేంద్రం కొత్తగా తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలతో కూడిన ఐదు కీలక డిమాండ్లను రైతులు తెరపైకి తెచ్చారు. వీటిపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతులు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వేదికగా ఎంచుకున్నారు. ఢిల్లీలోని నోయిడా నుండి పార్లమెంట్ కాంప్లెక్స్ వరకు నిరసనగా వెళ్లి తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. దీనికోసం నేటి నుంచి యునైటెడ్ కిసాన్ మోర్చా ఢిల్లీ మార్చ్ ప్రకటించింది.

దీంతో నోయిడా నుంచి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేప‌ట్టారు. ఈ క్రమంలో రైతులు సోమవారం మహామాయ ఫ్లైఓవర్ కింద నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేని పూర్తిగా అడ్డుకున్నారు. ఈ మార్గంలో రాక‌పోక‌లను నిలిపివేశారు. ఈ నిరసనతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో, ఆ ప్రాంతంలో వాహానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని పరిష్కరించి ఎక్స్‌ప్రెస్‌వేను తిరిగి కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రస్తుతం నిరసనకారులతో చర్చలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement