Friday, November 22, 2024

21వారాల 1రోజుకే జ‌న‌నం.. గిన్నిస్ రికార్డ్..

గ‌ర్భం దాల్చిన నాటి నుంచి 9 నెల‌లు దాటిన త‌ర్వాత డెలివ‌రీలు అవుతుంటాయి. లేదంటే నెల‌లు నిండ‌కుండా 7వ నెల‌లో కూడా పిల్ల‌లు పుడుతుంటారు. కానీ, కేవలం 21 వారాల ఒక్క రోజుతో జన్మించి ఆరోగ్యంగా బతికి బట్టగలిగాడు యూఎస్ కి చెందిన కర్టిస్ అనే చిన్నారి. అంతేకాదు గిన్నిస్ రికార్డు కూడా ద‌క్కింది.. ప్రపంచంలోనే అత్యంత నెలలు నిండకుండా జన్మించిన అరుదైన చిన్నారిగా ఈ బాబుని ప్రకటించడం విశేషం.

యూఎస్ లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21వారాలు ఒక్క రోజుతో జన్మించి ప్రపంచంలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్నాడు. చిన్నారి తల్లి మిచెల్ చెల్లీ బట్లర్ కి మొదట ప్రెగ్నెన్సీ బాగానే ఉంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె ఆరోగ్యంలో చిన్న సమస్య తలెత్తడంతో అత్యవసర శస్త్ర చికిత్స నిమిత్తం గత జూలై 4న ఆసుపత్రికి తరలించి ఆప‌రేష‌న్ చేసి డెలివరీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement