కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. మరోపక్క, నిన్న తిరుమల శ్రీవారిని 70,789 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,215 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement