Tuesday, November 26, 2024

బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజులోనే 4 వేల మంది మృతి

గతేడాది బ్రెజిల్‌ను కకావికలు చేసిన కరోనా మహమ్మారి అక్కడ మరోమారు చెలరేగిపోతోంది. కోవిడ్-19 ధాటికి బ్రెజిల్ చిగురుటాకులా వణుకుతోంది. దాని దెబ్బకు వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. ఒకే రోజులో 4 వేలకు పైగా కరోనా మరణాలు నమోదై ఆరోగ్య రంగానికి సవాలు విసురుతున్నాయి. 24 గంటల్లో 4,195 మంది కరోనాతో ప్రాణాలు పోగొట్టుకున్నారని బ్రెజిల్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో మృతుల సంఖ్య 3.40 లక్షలకు చేరింది. అమెరికా, పెరూ తర్వాత ఒకే రోజు 4 వేలకు పైగా మరణాలు నమోదైన మూడో దేశంగా బ్రెజిల్‌ నిలిచింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం, అత్యధికులు ఆస్పత్రి పాలవుతుండడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. దేశాన్ని కరోనా ఈ స్థాయిలో భయపెడుతున్నా దేశాధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement