Tuesday, November 26, 2024

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు

కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఘటనతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వ విప్, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి అంటగట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనపై ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగించేలా చేశారని.. ఆయనతోపాటు  వైసీపీ పార్టీని రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు వైసీపీ ఎస్టీ సెల్ నాయకుడు భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టారని చేసిన ఫిర్యాదు ఆధారంగా నారా లోకేష్ గారి పై డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్:111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 మరియు 506గా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

కాగా, గత నెల 21వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గం కు చెందిన టిడిపి కార్యకర్త మారుతి పై కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా రాంపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో మారుతికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న లోకేష్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అందుకే మారుతీ పై కక్ష కట్టి అతనిపై దాడి చేశారంటూ ఆరోపించారు. దీనిని కౌంటర్ చేస్తూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement