Friday, November 22, 2024

పిల్లలపై కరోనా పంజా…తిరుపతి లో థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందా ?

ఏపీలో ఫస్ట్ వేవ్ లో లక్షలలో కేసులు నమోదయ్యాయి. అలాగే సెకండ్ వేవ్ లో మరి కొంచెం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి కూడా ప్రతిరోజు వేలసంఖ్యలో కొత్తగా కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. అయితే కొద్దిరోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే సెకండ్ వేవ్ లో చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా ఈ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి లో ఎక్కువగా చిన్న పిల్లలలో కేసులు నమోదవుతున్నాయి. నెలల వయసున్న పిల్లలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని వైద్యులు కూడా చెబుతున్నారు.

కరోనా లక్షణాలు విషయానికొస్తే గతంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే కరోనా ఉన్నట్లు అనుమానించే వారు. కానీ ప్రస్తుతం ఎక్కువ మంది పిల్లలు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి తల తిరగటం వంటి లక్షణాలతో వస్తున్నారు. కానీ పిల్లల్లో జలుబు ,జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయకుండా దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటున్నారు. అప్పటికి లక్షణాలు పోతున్నాయి. ఆ తర్వాత వాళ్లను స్కూల్ కు పంపితే వేరే విద్యార్థులకు వ్యాపిస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తిరుపతిలో పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా పడుతుండడంతో తిరుపతిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement