తాండూరు : ప్రభుత్వం విద్యాసంస్థలపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని తాండూరు ప్రైవేటు అధ్యాపక జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాలలో ఆర్థిక ఇబ్బందలు, నోటిఫికేషన్లు రాక ఆత్మహత్యలకు పాల్పడిన ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపక, నిరుద్యోగులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్ల కోసం ప్రభుత్వం ప్రకటించిన 25 కిలోల రేషన్ బియ్యం, రూ. 2వేల ఆర్థిక సహాయం ప్రస్తుతం పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోదన్నారు. దానిని రూ. 7వేల నుంచి 10వేల వరకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ప్రైవేటు లెక్చర్లకు, నిరుద్యోగులకు కూడ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు విద్యాసంస్థలపై స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయాలని, ప్రైవేటు లెక్చరర్లను ఆదుకోవాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement