ఆంధ్రప్రభ స్మార్ట్ . అమరావతి – ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన.. వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. అమరావతితో నేడు ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల రాష్ట్ర తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో పాలనా వ్యవస్థ దారుణంగా తయారైందని అన్నారు. గత ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను కీలు బొమ్మలుగా మార్చిందని, దీంతో అన్ని వ్యవస్థలు దారుణంగా పతనం చెందాయన్నారు . . వాటిని తిరిగి పటిష్టం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
మా వాళ్లు జోక్యం చేసుకుంటే చెప్పండి..
ఇందుకోసం అధికారులు వేగంగా, నిజాయితీగా పని చేయాలని కోరారు. . రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందని అంటూ మీరు చేసే పనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకుల నుంచి ఎదైన సమస్య తలెత్తినా, మంత్రుల శాఖలో ఏమైన లోపాలు కనిపించినా .. తమ దృష్టికి తీసుకురావలని కలెక్టర్లను కోరారు పవన్ కల్యాణ్. అధికారులు కార్యకలాపాలలో మంత్రుల జోక్యం లేకుండా చూస్తామన్నారు.. రాష్ట్ర అభివృద్దికొసం జరిగే ఈ ఉద్యమాన్ని మాత్రం అధికారులు ఆపవద్దు అని అన్నారు.
”బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకేరోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతాం” అని పవన్ చెప్పారు.
పవన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించాం. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులను సైతం గత ప్రభుత్వం అవమానించింది.
• వ్యవస్థలను బలోపేతం చేయడంకోసం దెబ్బలు తిన్నాం, భరించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏనాడూ ఇటువంటి ఇబ్బందులు పడలేదు.
• మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అధికారం కట్టబెట్టారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో, మంచి ఓటింగ్ శాతంతో చారిత్రాత్మక విజయం సాధించాం
• వ్యవస్థలను బ్రతికించాలని, వ్యవస్థలను బలోపేతం చేయాలని మేం అధికారంలోకి వచ్చాం.
• ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడాం. గెలిచాం.
• మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. మీ సూచనలు చాలా ముఖ్యం..
• రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం.
• రాష్ట్ర సరిహద్దు కు రావాలంటే మమ్మల్ని అడ్డుకున్న పరిస్థితి.
• గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు.
• గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.
• గత ప్రభుత్వం పాలనను ఛిద్రం చేసింది.
• ఐఏఎస్, ఐపిఎస్ లను ఆటబొమ్మలు చేయడం బాధ కలిగించింది.
• పతనమైన వ్యవస్థను పటిష్టం చేస్తాం. ఇందుకోసం అధికారులు వేగంగా, నిజాయితీగా పని చేయాలి. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది
• ఏపీ అనేది ఒకప్పుడు ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండేది..గత ఐదేళ్లుగా చేసిన విధ్వంసంతో ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో అన్నదానికి ఉదాహరణగా ఏపీ నిలిచింది
• రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
• ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాదక్షత,అనుభవం, దార్శనికత నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కోసం మేము కష్టపడుతాం.
• రాజ్యాంగాన్ని కాపాడటంలో మాకు చంద్రబాబు మార్గదర్శకత్వం అందిస్తారని మేం భావిస్తున్నాం.
• మా తరపున ఏమైనా తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి. మేము సరిదిద్దుకుంటాం. ప్రత్యేకించి మా మంత్రుల శాఖలో ఏవైనా లోపాలు కనిపించినా.. మా దృష్టికి తీసుకురండి.. మేము వాటిని పరిష్కరిస్తాము.
• స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మాణం చేపడతాం.
• మంచినీరు అన్ని గ్రామాలకు అందించడమే మా లక్ష్యం.
• 5,40,000 మంచినీటి కుళాయిలను కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
• స్కిల్ సెన్సెస్ కోసం అధికారుల సలహాలు, సూచనలు అవసరం.
• వికసిత ఆంద్రప్రదేశ్ కోసం అధికారులు సూచనలు చాలా ముఖ్యం
• జవాబుదారీతనంతో కూడుకున్న ప్రభుత్వం వచ్చింది
• గ్రామసభలు ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీలను బలోపేతంచేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది..ఇది ఒక మహత్కార్యం.
• ఫైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నుండి ప్రారంభిస్తాం
• 4781 కి.మీల రోడ్లు వేయాలని చర్యలు తీసుకుంటున్నాం.
• అటవీ శాఖపై ప్రత్యేక దృష్టిసారించాం.
• గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరిలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం
• పంజాబీ వర్సిటీ ప్రొఫెసర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను.
• స్కిల్ సెన్సెస్ కు సంబంధి యువతకు దిశానిర్దేశం చేయాలి..
• వికసిత్ భారత్ కు పాటుపడదాం.