Friday, November 22, 2024

కరోనా కట్టడికి టీకాలు తీసుకోవాలి :కలెక్టర్ ఎమ్మెల్యే

జైనూర్రో – విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ టీకాలను తీసుకోవాలని కొమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు సోమవారం సిర్పూర్ యు మండలంలోని మహగమ్ లో గోండ్వానా రాయి సెంటర్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని కి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కరోనా వైరస్ పీకపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని టీకా తీసుకోవడం వల్ల కరోనా ను కట్టడి చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని అన్నారు కరోనా వైరస్ టీకాల పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని టీకాను తీసుకున్న వారు వైద్యుల సూచనలు పాటించాలని అన్నారు కరోనా ను కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ప్రజల సహకారం ఎంతో అవసరం అని అన్నారు రై సెంటర్ ఫర్ మిడ్డీలు ఆదివాసీ నాయకులు కరోనా టీక పై అవగాహన కల్పించి అందరూ టీకాలు తీసుకునేలా సహకరించాలని వారు కోరారు ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత రావు ఎంపీపీ భాగ్యలక్ష్మి వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ సుధాకర్ నాయక్ పెసా చట్టం జిల్లా కోఆర్డినేటర్ వసంతరావు సర్పంచులు భూపతి వీణ రాజేశ్వర్ అర్క నాగూరావు సహకార చైర్మన్ శివాజీ ఎంపీడీవో మధుసూదన్ తాసిల్దార్ రహీమ్ ఉద్దీన్ రాయి సెంటర్ సర్ మిడ్డీలు సభ్యులు ఆదివాసీలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement