ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం తనిఖీలలో రూ 15 కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు..ఈ సందర్భంగా కెన్యాకు చెందిన మహిళను అరెస్ట్ చేశారు.. ఈ కేసు వివరాలను డిఆర్ఐ వెల్లడించింది..
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తనిఖీ సందర్భంగా విదేశీ మహిళ బ్యాగ్ నుండి రెండు పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఆ బ్యాగ్‌లో హెయిర్ కండీషనర్, బాడీ వాష్ బాటిళ్ల నుంచి వైట్ కలర్ పౌడర్, కొకైన్ డ్రగ్స్ లభించాయి. మహిళను అరెస్టు చేశారు. పట్టుబడిన మహిళ కెన్యా జాతీయతకు చెందిన మహిళగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆమె నైరోబీ నుంచి ముంబైకి కేక్యూ 204 నంబర్ విమానంలో వచ్చినట్లు తెలిపారు.. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ సుమారు రూ15 కోట్లు అని తెలిపింది.