ఉమ్మడి మెదక్, ప్రభ న్యూస్ బ్యూరో: గ్రామీణ వాతావరణంలో నిర్వహించే ఉత్సవాలు, జాతర్లు ప్రజలను సుఖసంతోషాలతో ఉంచుతాయని బీఆర్‌ఎస్ రాష్ట్రనాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం ముంబాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలీ అబ్బాస్ జాతరకు నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు. పీర్లను దర్శించుకుని చద్ధరు కప్పి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. జాతర నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్‌ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. రాష్ట్రంలో ఉత్సవాలు ఘనంగా జరుగతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పండగులకు ప్రాధన్యం ఇవ్వడం వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ తలారి దయానంద్, మాజీ సర్పంచ్ నర్సింలు, లక్ష్మణ్, రాజు, విష్ణు, శ్రీనివాస్, పవన్, శ్రీనివాస్, ప్రకాష్, విజయ్, శ్రీకాంత్, ప్రశాంత్, గ్రామ పెద్దలు, ప్రజలు, NMR యువసేన సభ్యులు పాల్గొన్నారు.