టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. నవంబర్ 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కాగా, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు ఎంపీలతో చర్చించారు.
అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీల పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేలా మరింత దృష్టి సారించాలని సూచించారు. తమ తమ లోక్సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మరింత సమన్వయంగా కలిసి పని చేయాలని ఈ సందర్భంగా ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు.