Thursday, January 16, 2025

FEAST | అల్లుడూ… నీకోసం 120 రకాల వంటలు చేశా…

వైరా, జనవరి 16(ఆంధ్రప్రభ) : సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వైరాలో 120 వంటకాలతో కొత్త అల్లుడు, కూతురుకు విందు జరిగింది. ఈ విషయం ఈ ప్రాంతంలో కొత్త అల్లుడిని గౌరవించుకునే సంప్రదాయం సంక్రాంతి పండుగ సందర్భంగా వెలుగు చూసింది.

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని 12వ వార్డులో నివశిస్తున్న బాలాజీ జువెలరీ షాప్ నిర్వాహకులు నందిగామ భాస్కర్ రావు, సుజాత దంపతుల రెండో కుమార్తె మధుశ్రీ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లి గ్రామానికి చెందిన కొనకొల్ల సందీప్ తో ఇటీవల కాలంలో వివాహం జరిగింది. తెలుగు వారి ఇష్టమైన పండుగ సంక్రాంతి కావడంతో కొత్త అల్లుడు దంపతులకు అతిధి మర్యాదలు చేసేందుకు అత్తింటి వారు 120రకాలతో రకరకాల స్వీట్లు వంటకాలను వడ్డించి నూతన దంపతులను ఆనందపరిచారు.

ఈసందర్భంగా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నందిగామ భాస్కరరావు, సుజాత దంపతులు మాట్లాడుతూ… తెలుగు వారి ఇష్టమైన పండుగ సంక్రాంతి కావటంతో నూతన దంపతులను ఆనందపరిచేందుకు 120రకాల వంటకాలను తయారు చేయడం జరిగిందని తెలిపారు. తెలుగు వారికి ఇది గొప్ప పండుగని ప్రతిఒక్కరూ ఆనందంతో గడపాలని కోరారు. వేడుకల్లో నూతన దంపతుల తల్లిదండ్రులు, బంధువులు పాల్గొని ఘనంగా సంక్రాంతి వేడుక జరుపుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అల్లుడుడి జరిగిన గౌరవాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement