Monday, November 25, 2024

Cheating Case – లావ‌ణ్య – రాజ్ త‌రుణ్ కేసులో ఛార్జిషీట్ దాఖ‌లు

లావ‌ణ్య చెప్పిన వాటిలో నిజాలున్నాయ‌న్న పోలీసులు
ఇద్ద‌రు పదేళ్లు ఒకే ఇంటిలో స‌హ‌జీవ‌నం
నిందితుడిగా రాజ్ త‌రుణ్
అరెస్ట్ కాకుండా ముంద‌స్తు బెయిల్ పొందిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య వ్య‌వ‌హారంలో తాజాగా పోలీసులు మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. చార్జ్‌షీట్ ఫైల్ చేసిన పోలీసులు ఇందులో అత‌డిని నిందితుడిగా చేర్చారు. లావ‌ణ్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆమెతో రాజ్ త‌రుణ్‌ ప‌దేళ్లు స‌హ‌జీవ‌నం చేయ‌డం నిజ‌మేన‌ని తేల్చారు. వాళ్లిద్ద‌రూ ఒకే ఇంట్లో ఉన్న‌ట్లు త‌మ‌ ప్రాథ‌మిక విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయింద‌ని పోలీసులు తెలిపారు. అలాగే లావ‌ణ్య చెప్పిన దాంట్లో వాస్త‌వాలు ఉన్నాయ‌న్నారు. లావ‌ణ్య ఇంటి వ‌ద్ద పోలీసులు కీల‌క సాక్ష్యాలు సేక‌రించారు. కాగా, ఇప్ప‌టికే ఈ కేసులో రాజ్ త‌రుణ్ ముంద‌స్తు బెయిల్ తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement