Friday, October 18, 2024

NRI TDP | చంద్ర‌బాబుది ప్ర‌జా ప్ర‌భుత్వం.. గ‌ర్వంగా చెప్పుకుంటున్న జ‌నం!

  • లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోడెల శివ‌రాం
  • ప్రజాస్వామ్య విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌తోనే మేలు
  • ఇక మీద‌ట ఎన్ఆర్ఐ తెలుగుదేశం బాధ్య‌త అంతా వారిదే
  • లండ‌న్ మీట్ అంట్ గ్రీట్‌లో చంద్ర‌బాబు, లోకేష్‌పై పొగ‌డ్త‌లు

ఆంధ్ర‌ప్ర‌భ‌, అమ‌రావ‌తి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం లండన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి పార్టీ కార్య‌క‌ర్త‌లు మీట్ అండ్ గ్రీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పద్మభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. కాగా, దివంగ‌త నేత నందమూరి తారక రామారావుకు, కోడెల శివప్రసాద్‌కు, పల్నాడు ప్రాంత వాసి 40 ఏళ్లుగా తెలుగుదేశమే కుటుంబంగా మెలిగిన లగడపాటి అంజిబాబు చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళుల‌ర్పించారు. కార్యక్ర‌మంలో డాక్టర్ శివరాం మాట్లాడుతూ.. వంద రోజుల చంద్ర‌బాబు పాల‌న‌లో మంచి పేరు తెచ్చుకుంద‌ని, ఇది మ‌న ప్ర‌భుత్వం అని ప్ర‌జ‌లు గ‌ర్వంగా చెప్పుకునే చేశార‌న్నారు.

పేద‌ల భవిష్య‌త్తు బాగుండాలని సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. టీడీపీ, అధినేత చంద్రబాబు, యువనాయకుడు నారా లోకేష్ పట్ల ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంద‌న్నారు. అందుక‌నే దేశంలో ఎక్కడాలేని విధంగా వన్ సైడ్ విక్టరీని ప్రజలు అందించార‌ని ఆ న‌మ్మ‌కాన్ని కాపాడుకునేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నార‌ని అన్నారు.

- Advertisement -

2019లో వైసీపీ ప్రభుత్వం పాలనలోకి రాగానే వికృత చేష్ట‌ల‌కు దిగింద‌ని, కోడెల శివ‌ప్ర‌సాద్ తన పదవికి రాజీనామా చేసిన అనంతరం కార్యాలయంలో ఫర్నిచర్ తీసుకుని వెళ్ల‌మని అధికారులకు తెలియజేసినా.. కనీస సమాధానం ఇవ్వలేద‌న్నారు. రాజకీయ కక్ష్యతో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవలో ఉన్న ఒక రూపాయి డాక్టర్ మీద కేసులు పెట్టి, మానసికంగా హింసించార‌ని విమ‌ర్శించారు.

భగవంతుడు అనే వాడు ఎప్పుడు చూస్తుంటారు. ధర్మం ఎప్పుడు అధర్మం పై విజయం సాధిస్తూనే ఉంటుంది. ఈ రోజు జగన్‌ని చుస్తే 30 కోట్లు విలువ చేసే ప్రభుత్వ సొమ్ము ఇంటిలో పెట్టుకుని, ఆనాడు కోడెలపై మోపిన నిందలు తప్పుడు నిందలనే.. కనీసం పాప భీతి కూడా లేకుండా బతుకున్నాడు అని ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే అభిమానించే వారు ఎప్పుడు ఉంటార‌ని డాక్టర్ శివరాం అన్నారు. కార్యక్రమంలో UK NRI తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి శ్రీనివాసరావు, డాక్ట‌ర్ కోగంటి రామకోటయ్య దంపతులు, యువనాయకులు రాణా, NRI టీడీపీ యూకే సీనియర్ నాయకులు గుంటుపల్లి జయకుమార్, గోగినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ Meet & Greet కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారికి డాక్టర్ కోడెల శివరామ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో NRI తెలుగుదేశం పార్టీ విభాగాన్ని మరింత బలోపేతం చేయవలసిన భాధ్యత వారిపై ఉన్నదని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement