Tuesday, November 26, 2024

గులాబ్ తుఫాను: టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు..

తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాను ఎఫెక్ట్ భారీగా ఉంటోంది. పలు ప్రాంతాలు నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని అలాగే… ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు నారా చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని… తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.


తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలని… ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. వారికి అన్ని విధాల అండగా నిలవాలన్నారు. గులాబ్ తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని… విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి: సీతక్క

Advertisement

తాజా వార్తలు

Advertisement