వారం నుంచి ఎప్పుడు కూలుతుందా అని ఎదురుచూస్తున్న చైనా రాకెట్… మొత్తానికి ఎక్కడ కూలుతుందో ఓ క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు మన దేశ రాజధాని ఢిల్లీపై పడుతుందని శాస్రవేత్తలు అంచనా వేసినప్పటికి తాజాగా ఈ రాకెట్ హిందూ మహా సముద్రంలో పడింది. అయితే శకలాలు పూర్తిగా మండిన తర్వాత సముద్రంలో పడ్డట్లు తెలుస్తుంది. అంతకుముందు అమేరికా రక్షణ శాఖ చైనా రాకెట్ భూమిపై కూలే ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఆదివారం ఉదయం 4:30 గంటలకు రాకెట్ శకలాలు భూమిని ఢీకొంటాయని అంచనా వేసింది. మధ్య ఆసియాలోని తుర్క్ మెనిస్థాన్ లో కూలే అవకాశం ఉందని యూఎస్ రక్షణ శాఖ పేర్కొంది. అయితే తాజాగా రాకెట్ హిందూ మహా సముద్రం లో పడింది.
కాగా ఏప్రిల్ 29న భూమి నుంచి బయలుదేరి… చైనా స్పేస్ స్టేషన్ తియాన్హే (Tianhe)కి చెందిన కోర్ మాడ్యూల్ని మోసుకెళ్లిన లాంగ్ మార్చ్ 5B రాకెట్… గతి తప్పింది. ఇవాళ అది భూమిపై కూలిపోబోతోంది. ఐతే… అది ఎక్కడ పడుతుందా అని వారం నుంచి శాస్త్రవేత్తలు, చైనా ప్రభుత్వం, ప్రపంచ ప్రజలు టెన్షన్ పడ్డారు.