ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తూ పదవికి రాజీనామా చేయకుండా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయ్ నామినేషన్ను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీ అభ్యర్థులు కలిసి రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని కోరుతూ రిటర్నింగ్ అధికారి వాహనానికి అడ్డంగా కూర్చుని, నిరసన వ్యక్తం చేశారు.