భారీ వర్షాలతో పంబా నది ఉప్పొంగుతోంది. దాంతో పవిత్ర శబరిమల యాత్రను నిలిపివేశారు అధికారులు. పతనంథిట్ట జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా పంబా నదిలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో కక్కి-అనథోడ్ రిజర్వాయర్, పంబా డ్యామ్ లో వరదనీరు ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా పంబ, శబరిమల యాత్రను శనివారం నిలిపివేస్తున్నామని జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భక్తులు యాత్రను చేపట్టొద్దని అధికారులు అభ్యర్థిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..