29) మనలోని అన్ని చెడు ఆలోచనలు, ఒత్తిడి కలిగించే ఆలోచనలను అంతం చేయటానికి మనం తప్పనిసరిగా అంతరాత్మ అనే వ్యాయామశాలలో శ్రమించాలి. ఇలాంటి ఆలోచనలతో పోరాటం చేస్తున్న కొద్దీ అవి మరింతగా ధృడంగా అవుతాయి. వాటిని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే మనం ఉహించని విధంగా మరింత వేగంగా, రెట్టింపై విసిరిన బంతిలాగా అవి వెనుకకు తిరిగి వస్తాయి. అలాంటి ఆలోచనలను పరిశీలన చేసి, వాటికీ జీవనాన్ని ఇస్తున్న శక్తిని నిరాకరించడం అంటే, వాటికి జీవశక్తి అయిన మన ధ్యాసను వాటితో సంబంధము లేనట్లు-గా ప్రకటించి, తొలగిస్తే అవి కరిగిపోయి, కనుమరుగు అవుతాయి. వాటి మరణం మన మరణం కాదు, మన గురించి మనకు మరింతగా అంటే నిశ్శబ్దంగా, స్థిరంగా, మనలో ఎప్పుడు ఉపస్తితం అయి ఉన్న స్వయం గురించి స్వయమునకు అవగాహన పెరుగుతుంది. ఈ రోజు నాలోని చెడు ఆలోచనలు అంతం చేయడానికి సరి అయిన వ్యాయామము చేసి ధృడంగా అవుతాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి