భారతీయ సనాతన ధర్మంలో దాంపత్యం అపూర్వమైనది. అది ఒక గొప్ప సంస్కారాన్ని, సమాజంలో గౌరవం స్థానాన్ని ఇస్తుంది. జీవితం సుఖ శాంతులుతో గడపడానికి వివాహం, తద్వారా కుటుంబ వ్యవస్థ ఎంతో దోహదం చేస్తాయి. మానవులు దైవం ఋణం, పితృఋణం, గురు ఋణం తప్పక నెరవేర్చాలి. అవి నెరవేర్చ డానికి కర్త ఒక్కడు చేయకూడదు. తప్పనిసరిగా భార్య కూడా ఉండాలి. నాలుగు ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమ ధర్మం ఉత్తమమై నదిగా వేదాలు చెపుతున్నాయి. స్త్రీకి ప్రాతివత్యం, పురుషుడుకి ఏకపత్నీ వ్రతం నిర్ణయించారు. అగ్నిసాక్షిగా, పంచభూతాల సాక్షిగా జరిగే వివాహం లో వల్లించే మంత్రాలు ప్రభావం వల్లనే ఆ దాంపత్యం సుఖశాంతు లతో ఉంటుంది. సత్సంతానాన్ని పొందుతారు. భార్యకు పతివ్రతా ధర్మాల ను రామాయణం, భవిష్య పురాణం, మహాభారతం వివరిస్తున్నాయి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు సరస సంభాషణ చేస్తున్న సందర్భం లో శివుడు పార్వతితో ” దేవీ! స్త్రీ ధర్మం ఎలాంటిదో వివరించ మని కోర గా, పార్వతి బదులిస్తూ ”నాథా! తరుణీ ధర్మం ఎటువంటిదో తమకు నివేదించడానికి నేను ఏ పాటిదాన్ని? అయినా నాకు తెలుసున్న విషయా లు తెలియచేస్తాను. కన్యలను వివా#హం చేసే విషయంలో కర్త లు తల్లి దండ్రు లు, పినతండ్రి, మేనమామ, అన్నదమ్ములు వీరిలో ఎవ్వరైనా మంచి పురుషుడుకిచ్చిన వివా#హం జరిపించాలి. వివాహం అయిన పిమ్మట ఆమెకు భర్తయే సర్వాధికారి. పతినే దైవంగా భావించి, అతడి ఇష్టానుసారం నడుచుకుంటూ, నిత్యానుష్టానం, దేవతలు, అతిథులు పూజలు సద్బుద్ధితో నెరవేరుస్తూ, భర్త మేలుకోరుతూ, సంతానం పొంది, సంసారయాత్ర కొనసాగించాలి. గృహణి తన భర్తచేసే పనుల కు ఆటంకం కలిగించకూడదు. భర్త ఆమె పొందుకోరినప్పుడు సహక రించాలి. భర్త తల్లిదండ్రులను, భర్త వైపు బంధువులను గౌరవించాలి. ఆదరణ చూపాలి. కన్న కొడుకుతోనైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే ఆస నంపై కూర్చోవడం, ఒకే శయ్యమీద పవళించడం ధర్మానికి విరుద్ధం.
కైలాస వాసా! భర్త దరిద్రుడైనా, ధనవంతుడైనా, అందగాడైనా, రూపహనుడైనా, తెలివి మాలినివాడైనా, ఏమీ చింతించక భార్య తన భర్తను ఆదరించాలి. యాచకులకు భిక్షం పెట్టడం, అతిథి సత్కారాలు చేయడం గృహణి ధర్మం. భర్త పిల్లలు సంక్షేమాన్ని ఆశించి నోములు, వ్రతాలు, పూజలు చేస్తుండాలి.
దయాశేఖరా! భార్యాభర్తల అన్యోన్యమే ఆ ఇంటికి శ్రీరామరక్ష. ఆమె అతనికి సేవకురాలుగా ఉండడం వల్ల సతికి సర్వ శుభాలు కలుగు తాయి. మోక్షం సిద్ధిస్తుంది. అధర్మ మార్గంలో నడిచే స్త్రీ పైజన్మలో రాక్షసి, పైశాచిక, ఆహుతి లక్షణాలతో జన్మించి ఎన్నో కష్టాల పాలు అవు తారు. కొంతమంది క్రూర కత్యాలు అంటే పరపురుషుడి మోజులో భర్త ను హంసించడం, అత్తమామలను హంసించడం చేస్తూంటారు. మరి కొంతమంది ధనాన్ని ఇష్టం వచ్చినట్లు దుబారాగా ఖర్చు చేస్తూంటారు. వారి మనసు నిలకడగా వుండదు. వారిలో ఈర్ష్య, క్రోధం, అసూయ వంటి దుర్గుణాలు వెన్నంటే ఉంటాయి. అయిన దానికి,కాని దానికి కాలు దువ్వుతుంటారు. అసత్య వచనం, గయ్యాళితనం వీరికి ఆభరణా లు. ఇటువంటి స్త్రీలకు నరక లోకప్రాప్తే.” వివరించింది పార్వతీదేవి.
రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి భార్య మహాపతివ్రత, అనసూయ దగ్గరకు సీత వెళ్ళి నమస్కరించి ” ఆరోగ్యంగా ఉన్నారా?” అని అడగ్గానే, అనసూయ సంతోషంతో సీతను నిమురుతూ ”భాగ్య వంశము చేత నీవు ధర్మాన్ని పాటిస్తున్నావు. బంధువులను ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని విడిచి నీవు రాముని వెంట వనవాసా నికి వచ్చావు. ఏ స్త్రీ తన భర్త వనములో ఉన్నా, నగరంలో ఉన్నా, పాపాత్ముడైనా, పుణ్యా త్ముడైనా, భర్తను అనుసరించి ఉండెదరో వారికి ఉత్తమ లోకాలు కలుగు తాయి. వేదాలు స్త్రీకి పతి శుశ్రూష తప్ప మరే తపస్సును సూచించలేదు. సావిత్రిదేవి పతి శుశ్రూష చేయడంవల్లనే శాశ్వతంగా స్వర్గలోకంలో ఉంది. నువ్వు నీ ధర్మాన్ని ఇలాగే నెరవేరుస్తూ ఉండు” అని ఆశీర్వ దిం చింది. భవిష్య పురాణం కూడా పతివ్రతా ధర్మాలను తెలియ చేస్తోంది. భర్త ఆజ్జ ఏమాత్రం జవదాటనిది, ఉత్తమమైన స్త్రీలు తన భర్త ను మనసా-వాచా- కర్మణా దైవంగా భావించి అనుసరించాలి. అటు వంటి వారికి బంగారం, రత్నాలు మొదలగు ఏ అలంకారాలైనా బరువై పోతాయి అని పేర్కొంది. దుర్బుద్ధి కల పురుషుడు వక్రబుద్ధి గల స్త్రీని పెండ్లాడినట్లయితే, ఆ సంసారం సరిగా నడవదు. అందుకే భార్యాభర్త లు అన్యోన్యతతో ఉండాలి.
భార్యాభర్తల అన్యోన్యమే ఇంటికి శ్రీరామరక్ష
Advertisement
తాజా వార్తలు
Advertisement