Thursday, November 21, 2024

20వ‌రోజుకి చేరిన భారత్ జోడో యాత్ర‌-బిజెపిపై విమ‌ర్శ‌లు గుప్పించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర 20వ రోజుకి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ రెండు హిందుస్థానాలను అంగీకరించదని అన్నారు. బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు దేశ విభ‌జ‌న‌కు పాల్ప‌డుతున్న‌ద‌నీ, దో హిందుస్థాన్ ను సృష్టిస్తున్న‌ద‌ని ఆరోపించారు. సంప‌న్నుల‌కు లాభం చేకూర్చే విధంగా ప్ర‌భుత్వం పేద‌ల‌పై భారం మోపుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఈరోజు బడా పారిశ్రామికవేత్తల నుంచి వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు.. కానీ, రైతు, చిన్న వ్యాపారి చిన్న రుణం కూడా తీర్చలేకపోతే ‘డిఫాల్టర్’ అంటూ జైల్లో పెడుతున్నారు. ప్ర‌తి అన్యాయానికి భారత్ జోడో యాత్ర వ్యతిరేకం. ఈ ‘దోటూ హిందుస్థాన్’ వెర్షన్‌ను దేశం అంగీకరించదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడంతో పాటు గత వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర మంగళవారం నాటికి 20 రోజుకు చేరుకుంది. మంగళవారం కేరళలోని మలప్పురం జిల్లాలోకి ప్రవేశించిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రాహుల్ గాంధీ వెంట నడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement