కలియుగంలో మానవుల ప్రవృత్తి – నివృత్తి ఎలా ఉంటాయో మనలను అంటిపెట్టుకుని ఉన్న దుర్గుణాలు వల్ల ఎలా మానసిక ఒత్తిడి ఉంటుం దో? తెలుపుతూ, వాటి పరిష్కారానికి మార్గాలు కూడా ఇతిహాసాలు అయిన రామాయణం, మహాభారతం, భాగవత పురాణాలు చెబుతున్నాయి.
అవేకాకుండా భగవద్గీత, ఉపనిషత్తులు కూడ మనం ఏవిధంగా ధర్మమా ర్గంలో వెళ్ళాలో విశిదపరుస్తున్నాయి. ఎన్ని చెప్పినా, ఎన్ని భాష్యాలు విన్నా, మార్పు రాకపోతే జీవితానికి అర్థం ఉండదు. అందుకే ఆదిశంకరాచార్య మన ల్ని జాగృతం చేయడానికి భజగోవింద శ్లోకాలను అందించారు. దీనిలో వేదాం త సూత్రాలను, ధర్మ విశేషాలు సున్నితమైన, భాషలో రాసారు.
”భజగోవిందం” అంటే సంసార తాపత్రయంలో పడి దు:ఖం కొని తెచ్చు కోకు. ఆ గోవిందుని భజన చేస్తే, మోక్షమైనా సిద్ధిస్తుంది అని అందించారు. గోవిందుని భజన వల్ల మనస్సు నిర్మలమై, జ్ఞానం పొందగలం. జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలు, సమస్యలు కళ్ళకు కట్టినట్లు వివరించారు. దీనిలో 31 శ్లోకాలు ఉన్నాయి. అందులో 12 శ్లోకాలు ఆదిశంకరులే చెప్పారు. వాటిని ”ద్వా దశ మంజరికా స్తోత్రం” అంటారు. ఆయనతో కూడా ఉన్న శిష్యులు 14 మంది ఒక్కొక్కరు, ఒక్కొక్క శ్లోకం చెప్పారు. అలా 14 శ్లోకాలను ”చతుర్థశ మంజరికా స్తోత్ర రత్నావళి” అంటారు. ఇక ముగింపుగా ఐదు శ్లోకాలు ”వైరాగ్య ప్రబోధి ని”గా విశ్లేషించి అందించారు.
భజగోవిందం శ్లోకాలు రావడానికి కారణం
ఒకరోజు కాశీ క్షేత్రంలో తన శిష్యులతో. గంగా స్నానం చేసి తిరిగి ఆశ్రమా నికి వస్తూండగా, ఒక వృద్ధ బ్రాహ్మణ పండితుడు అరుగు మీద కూర్చుని, వ్యాక రణం వల్లె వేసుకుంటున్నారు.అది చూసి వెంటనే శంకరాచార్యులు —
”భజగోవిందం భజగోవిందం
గోవింద భజ మూఢమతే,
సంప్రాప్తే సన్నిహత కాలే
నహ నహ రక్షతి డుకృణ్ కరణ!!”
అంటే ఓ! మూఢుడా! గోవిందుని భజించు. గోవిందుని భజించు. గోవిం దుని భజించు. మృత్యువు ఆసన్నమైనప్పుడు ఈ వ్యాకరణ పాఠాలు నిన్ను ఏవిధంగానూ రక్షించలేవు. మూడుసార్లు చెప్పారు. ఎందుకంటే మనసా- వాచా- కర్మణా గోవిందుని భజించు అని. పై శ్లోకంలో ”మూఢమతే” అన్నారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడునే కాదు, మానవులందరికీ
ఒక హచ్చరిక చేశారు. ఎందుకంటే శంఖు, చక్ర, గదా పద్మాలతో కూడిన సగుణ రూపంలో ఉన్న భగవంతుని పూజించి, ఫలాపేక్షతో అర్థకామాలను పొందాలనుకొనే వారికి ఉన్నది మూఢత్వమే కదా! అందుకే ఆయనలా అన్నారు.
రెండవ శ్లోకంలో ”మూఢ జహహ ధనాగమ తృష్ణాం- వినోదయ చిత్తం లో మన కోరికలు, వ్యామోహానికి అంతులేదు. మనసును నియంత్రణ చేసి ”ధన తృష్ణను” ఇంకా సంపాదించాలి! ఇంకా సంపాదించాలి! అనే ఆరాటంలో అధర్మంగా ప్రవర్తిస్తూ ఎన్నో తప్పుడు పనులకు దోహదం పడతాము. ధనం ఒక సాధనంగా మాత్రమే గుర్తు ఎరిగి, ధర్మబద్ధంగా, కావలసినంత మాత్రమే సంపాదించుకోవాలి. తదుపరి శ్లోకాలలో స్త్రీ సుఖం గురించి పరితపించడం, చంచలమైన జీవితం గురించి తపన, తోడు రాని బంధాలు, ముక్తికి మూడు మెట్లు వంటి జీవిత సత్యాలను ఎత్తి చూపారు. చివరకు నువ్వు సంపద ఎంత కూడబెట్టినా నీతో రాదు కదా! బంధువులు, కన్నపిల్లలు మధ్య వైషమ్యాలు వస్తాయి. నీతో కూడ వచ్చేది నీవు చేసే దానధర్మాలు, సత్కర్మలు మాత్రమే. మరొక శ్లోకంలో నీవు ఎవరివో? తెలుసుకో అంటూ ఇలా-
”కాతే కాన్తా కస్తే పుత్ర:
సంసారో యమతీవ విచిత్ర:
కస్యత్వం వాకుత ఆయాత:
తత్త్వం చిన్తయ తదిహభ్రాత:!”
అంటే ఈ భార్య, పిల్లలు, బంధువులతో నీకు గల బంధాన్ని తెలుసుకో. యదార్థమైన చింతన చేయి. చివరకు ఆ గోవిందుని భజించవలసిందే! అని మన హృదయాలను తట్టి లేపారు.
శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చెప్పారు అని తెలుసుకొన్నాం కదా! అందులో ఒక శిష్యుడు చెప్పిన శ్లోకం —
”శత్రౌ మిత్రౌ పుత్రౌ బన్దే భేధా జ్ఞానం!”
అనే శ్లోకంలో శత్రువులు, మిత్రులు, పుత్రులు, బంధనాలు, తగాదాలు, సంధి కుదర్చడం, వంటి కార్యాల్లో నీ సమయాన్ని వృథా చేసుకోక, సమత్వ భావనతో, బేధ బుద్ధి మాంద్యంతను త్యజించు. అని గట్టిగా విశిదపరచారు. ప్రస్తుత సమాజంలో నా వారు, పరాయి వారు, నాకు హతులు, నాకు శత్రువులు అనే బేధ భావం ఎక్కువగా ఉంది. చివరగా శంకరులు రాసిన ఐదు శ్లోకాలు వైరాగ్య ప్రబోధినిగా తెలుసుకొన్నాం. దానిలో ఒక శ్లోకంలో అర్థం పరమార్థం అంటూ- —
”అర్థ మనర్థం భావయ నిత్యం! నాస్తి తతస్సుఖ లే సత్యం
పుత్రాదపి ధన భాజాం భీతి:! సర్వత్త్రైషా విహతా రీతి:!!
ధనం అనేక అనర్థాలు తెచ్చిపెడుతుంది. భయాన్ని కలిగిస్తుంది. మానసిక సుఖం ఉండదు. చివరకు నిద్ర పట్టదు. తన కన్న పిల్లలను కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ముందుగా డబ్బు ఉపయోగించడం నేర్చుకోవాలి. అంతేకాని దానికి లొంగిపోయి, భౌతిక, మానసిక కష్టాలను కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. దీనిక అంతటికీ మనసు కారణం. దానిని నియంత్రించుకోవాలి. మనలను జాగృతం చేస్తూ, పరోక్షంగా ఒక హచ్చరిక చేశారు.
”రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రి యై శ్చరన్” అంటే రాగద్వేషాలతో సతమతమయ్యే మనసులో అలజడి, తద్వా రా అశాంతి తప్పదు. వీటిని అర్థం చేసుకొంటూ ఎదిగే వ్యక్తిలో మోహం నశిస్తుంది.
నిర్మోహ స్థితి కలిగిస్తుంది. కనుకనే ఈ భజ గోవింద శ్లోకాలను ”మోహ ముద్గరము” అని కూడా అంటారు. కాబట్టి, మన ముందున్న కర్తవ్యం ఆ భజగోవింద శ్లోకాలు అర్థం చేసుకొని, ఆ దిశగా నడుద్దాం.