బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసును క్లోజ్ చేసేందుకు ఎస్ఐ పవన్, కానిస్టేబుళ్లు సంతోష్, రామకృష్ణ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు.
అయితే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక, ముందస్తు పథకం ప్రకారం బాధితుడి నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసిన అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.