Saturday, December 21, 2024

NFA | కార్తికేయ 2కి బెస్ట్ తెలుగు సినిమాగా అవార్డు… !

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు జరిగింది. ఈ వేడుకలో, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు పలువురు కళాకారులను సత్కరించారు.

ఈ అవార్డు వేడుకలో… ఉత్తమ తెలుగు సినిమా కార్తికేయ 2, ఉత్తమ తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ – మొదటి భాగం, ఉత్తమ పంజాబీ సినిమా బాఘీ ది ధీ, ఉత్తమ ఒడియా సినిమా దమన్, ఉత్తమ మలయాళ సినిమా సౌదీ వేలక్క, ఉత్తమ మరాఠీ సినిమా వలవి, ఉత్తమ కన్నడ సినిమా KGF – 2ల‌కు అవార్డులు వచ్చాయి

ఇక కాంతారా మూవీకి రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. అదే సమయంలో నిత్యా మీనన్, మానసి పరేఖ్ తిరుచ్చితంబలం, కచ్ ఎక్స్‌ప్రెస్ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement