Monday, November 25, 2024

అటు ప్రియుడు ఇటు తండ్రి మ‌ధ్య‌లో ప్రేమ‌

ప్ర‌స్తుత రోజుల్లో యువ‌త త‌మ‌కు న‌చ్చిన దానికి కోసం ఎంత‌గైనా ఒడిగ‌డుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం హైద‌రాబాద్‌లోని కుషాయిగూడ పోలీసు స్టేష‌ణ్ ప‌రిధిలో ప్రియుడి కోసం ఓ మైన‌ర్ తండ్రిని హ‌త్య చేయించింది.పోలీసులు తెలిపిన వివ‌రాల స్థానికంగా నివాసం ఉంటున్న రామ‌కృష్ణ అనే వ్య‌క్తికి ఓ కూతురు ఉంది. ఆమె ఓ యువ‌కుడిని ప్రేమిస్తోంది. ఈ విష‌యం తండ్రి రామ‌కృష్ణ‌కు తెలియ‌డంతో.. కూతురిని మంద‌లించాడు. వారి ప్రేమ‌ను తిర‌స్క‌రించాడు. త‌న ప్రేమ‌కు అడ్డుప‌డుతున్న తండ్రిని హ‌త్య చేయించాల‌ని కూతురు ప్లాన్ చేసింది. దీంట్లో భాగంగా సుపారీ గ్యాంగ్‌ను బాలిక సిద్ధం చేసింది.

ఇక మొద‌ట చికెన్ క‌ర్రీలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి తండ్రి రామ‌కృష్ణ‌కు అన్నం వ‌డ్డించింది. ఆ త‌ర్వాత తండ్రి స్పృహ కోల్పోయాడు. అనంత‌రం ప్రియుడికి స‌మాచారం అందించింది. దీంతో ప్రియుడు సుపారీ గ్యాంగ్‌తో ప్రియురాలికి ఇంటికి చేరుకుని రామకృష్ణ‌ను హ‌త్య చేశారు. ఈ కేసులో మైన‌ర్ తో పాటు ప్రియుడిని, మ‌రో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement