Tuesday, November 26, 2024

అసైన్డ్ భూముల్ని ఈట‌ల క‌బ్జా చేశారు…. క‌లెక్ట‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న

హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంబంధించిన జమున హేచ‌రీస్ భూముల సర్వే పై వివరాలను వెల్లడించేందుకు ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ…. జమున హేచరిస్ భూముల్లో సర్వే నంబర్ లో130,81 లో సిల్లింగ్ భూములు అసైన్డ్ భూములు ఉన్నాయని స్ప‌ష్టం చేశారు. ఈ భూముల్లో ఎస్సీ, ముదిరాజ్ వంజర వివిధ కమ్యూనిటిలున్నాయని, 1974 ప్రకారం ఫాల్ట్రీ ఫామ్ కు పీసీవో పర్మీషన్ లేదని వెల్ల‌డించారు.


అక్రమంగా, దౌర్జన్యంగా తీసుకున్న భూములపై ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చామని కలెక్ట‌ర్‌ పేర్కొన్నారు. 56 మంది గల70 ఎక‌రాల‌ 33 గుంటల భూములను దౌర్జంగా లాక్కున్నారని వివరించారు. అసైన్డ్ భూముల్లో ప్రలోభాలకు గురిచేశారని, ఆ భూములు రిజిస్ట్రేషన్ కావని స్ప‌ష్టం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారని, హల్దీ వాగు దగ్గర 97 సర్వ్ నంబర్ లో పాల్ట్రీకి సంబంధించినవి వేశార‌ని వెల్ల‌డించారు. జమున హేచరిస్ భూములు సంబంధించిన 70.33 గుంటలు అక్రమంగా దౌర్జన్యగా కబ్జా చేశారని క‌లెక్ట‌ర్‌ చెప్పారు. అచ్చంపేట గ్రామానికి చెందిన 56 కుటుంబాల‌కు చెందిన 70 ఎక‌రాల 33 గుంటలు భూమి కబ్జా జరిగిందన్నారు. భూమి హక్కుదారులు.. త‌మ‌ భూమి కావాలని కోరారని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేశామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement