Friday, November 22, 2024

Asian Games – భార‌త్ కు బాక్సింగ్ లో రెండు.. స్వ్కాష్ లో ఒక మెడ‌ల్

చైనాలో జ‌రుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత స్టార్ బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, రజతం గెలిచింది. 75 కిలోల మహిళల బాక్సింగ్ విభాగంలో ఫైనల్ చేరిన లోవ్లినా బోర్గోహైన్, చైనా బాక్సర్, వరల్డ్ కప్ మెడలిస్ట్ లి కియాన్‌ చేతుల్లో 0-5 తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో రజత పతకంతో పాటు ఒలింపిక్స్‌కి కూడా నేరుగా అర్హత సాధించింది లోవ్లినా బోర్గోహైన్…

మహిళల 57 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ ప్రవీణ్ హూడా కాంస్యం గెలిచింది.

అలాగే 75 కిలోల బాక్సింగ్ విభాగంలో ల‌వ్ లీనా సైతం కాస్యం ప‌త‌కం కైవ‌సం చేసుకుంది..

స్వ్కాష్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీస్ చేరిన అనహత్ సింగ్- అభయ్ సింగ్ కాంస్య పతకం గెలిచారు.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి, ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌తో 24-22, 16-21, 21-12 తేడాతో విజయాన్ని అందుకుని, క్వార్టర్ ఫైనల్స్‌కి ప్రవేశించారు..
బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- తనీశా క్రస్టో రెండో రౌండ్ నుంచే నిష్కమించారు. రెండో రౌండ్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడలిస్టులు జాంగ్ షుషియన్- జెంగ్ యుతో జరిగిన మ్యాచ్‌లో 13-21, 21-23 తేడాతో పరాజయం పాలైంది భారత బ్యాడ్మింటన్ జోడి..

- Advertisement -

ఆర్చరీలో మాత్రం భారత్‌కి ఆశించిన ఫలితాలు రాలేదు. వ్యక్తిగత పురుషుల విభాగంలో అథాను దాస్, ధీరజ్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయారు. మహిళల వ్యక్తిగత విభాగంలో భజన్, అకింత క్వార్టర్ ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత ఆర్చరీ టీమ్, క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడింది. అయితే భారత్ ఆర్చరీ టీమ్‌ ఈవెంట్‌‌లో శుక్రవారం పోటీపడనుంది.

భారత మరో మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్ జోడి దీపికా పల్లికల్, హారీందర్‌సింగ్ ఫైనల్ చేరారు.

పురుషుల హ‌కీ జ‌ట్టు సెమీస్ లో సౌత్ కొరియాను 3-1 స్కోర్ తో ఓడించి ఫైన‌ల్స్ కు దూసుకెళ్లింది.

భారత మహిళా కబడ్డీ జట్టు, వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement