Saturday, November 23, 2024

Asia Cup Schedule – ఆగ‌స్ట్ 31నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు ఆసియా క‌ప్ ….

ఆసియా కప్‌-2023 షెడ్యూల్‌ ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 17 వరకు మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్‌ ప్రకటించింది. భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌తో కూడిన ఆరు జ‌ట్ల‌తో టోర్నీ 18 రోజులపాటు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో 13 మ్యాచ్‌లు ఉంటాయి.

పాక్​లో నాలుగు.. లంకలో తొమ్మిది..
అయితే హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ జరుగుతుందని ఏసీసీ వెల్లడించింది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏసీసీ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ టోర్నీకి అతిథ్యమిచ్చే అవకాశం పాకిస్థాన్‌కు రావడం గమనార్హం. దీంతో మరోసారి భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు రానుంది. అయితే శ్రీలంక వేదికగానే ఇరు జట్ల మ్యాచ్‌ జరగనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement