Tuesday, November 19, 2024

ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరణ

ఎన్‌సీబీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
తెరపైకి కొత్త నటితో డ్రగ్స్‌ చాట్‌ అంశం
కోర్టుకు నివేదించిన ఎన్‌సీబీ న్యాయవాది
హైకోర్టును ఆశ్రయించనున్న ఆర్యన్‌ఖాన్‌

ముంబై: షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. బుధవారం ముంబయి ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్‌ నిరాకరించింది. అతడితోపాటు మరో ఇద్దరికి కూడా బెయిల్‌ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అక్టోబర్‌ 2న ముంబై తీరప్రాంతంలో క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిం దే. ఆ సమయంలో ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదని అతడి తరఫు న్యాయవాదులు ఇదివరకే కోర్టుకు వెల్లడించారు. ఇప్పుడు బెయిల్‌ ఇస్తే డ్రగ్స్‌ కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని ఎన్‌సీబీ వెల్లడించింది. ఈ క్రమంలో ఆర్యన్‌ పలుమార్లు పెట్టుకున్న బెయిల్‌ అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది. ఈ రోజు విచారణలో భాగంగా ఎన్‌సీబీ కోర్టుకు పలు ఆధారాలు సమర్పించింది. ఓ నటితో ఆర్యన్‌ డ్రగ్స్‌ గురించి చాటింగ్‌ చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని చెప్పింది. అంతె గాక, డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్యన్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచా రం. అందుకు సంబంధించిన వాట్సాప్‌ చాట్‌ల ను ఎన్‌సీబీ నేడు కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్‌ విక్రేతలకు అతడు రెగ్యులర్‌ కస్టమర్‌ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్‌సీబీ వెల్లడిం చింది. మరోవైపు ఆర్యన్‌ మరికొంతకాలం ఆర్థర్‌ రోడ్డు జైల్లోనే ఉండాల్సి ఉంది. నవంబర్‌ మొదటివా రంలోనే అతడికి బెయిల్‌ రాలేదంటే ఆ గడువు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెలలో కోర్టులకు సెలవులు ఉండట మే అందుకు కారణం. దాంతో ఈ లోపే న్యాయవాదులు ఆర్యన్‌కు బెయిల్‌ ఇప్పించే పనిలో ఉన్నారు. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా, ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరించిన నేపథ్యంలో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేను మీడియా ప్రశ్నించింది. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు బదులివ్వడానికి నిరాకరించిన సమీర్‌ ‘సత్యమేవ జయతే’ అంటూ స్పందించారు.
ఓ కొత్త నటితో ‘ డ్రగ్స్‌చాట్‌

ఓ బాలీవుడ్‌ నటితో ఆర్యన్‌ డ్రగ్స్‌ గురించి చాటింగ్‌ చేసినట్లు ఎన్‌సీబీ దర్యాప్తులో గుర్తించింది. అందుకు సంబంధించి న ఆధారాలను నేడు కోర్టుకు సమర్పిం చింది. అక్టోబరు 2న క్రూయిజ్‌ నౌకపై పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్‌ ఖాన్‌.. ఓ నటితో డ్రగ్స్‌ గురించి వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎన్‌సీబీ తెలిపింది. ఆ నటి త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందట. అంతేగాక, డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్యన్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వాట్సాప్‌ చాట్‌లను ఎన్‌సీబీ నేడు కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్‌ విక్రేతలకు అతడు రెగ్యులర్‌ కస్టమర్‌ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్‌సీబీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement