Sunday, January 19, 2025

AP l సంక్రాంతి వేళ చేనేత ప్రమోషన్ – సతీమణికి లోకేష్ మంగళగిరి శారీ గిఫ్ట్

నారావారిపల్లె – ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సంక్రాంతి వేడుకలను తమ స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకుంటున్నారు. ఆయన అవకాశం ఉన్న ప్రతి చోటా మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తుంటారని తెలిసిందే.

చేనేతలపై అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతుంటారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్ళిన లోకేశ్… భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.

- Advertisement -

బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేశ్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి చేనేత దుస్తులు ధరించడం ద్వారా మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. తమపై లోకేశ్, ఆయన కుటుంబ చూపుతున్న అభిమానానికి మంగళగిరి చేనేతలు మురిసిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement