ఏపీ నుంచి 1,912 మంది, తెలంగాణ నుంచి 1,447 మంది అభ్యర్థన
122 తెలంగాణ ఎన్జీవోల బదిలీకి అంగీకరించాం
61 మందిని బదిలీ చేశాం
తెలంగాణతో సంప్రదింపులు జరిపాం
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :
ఏపీ, తెలంగాణలో 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ నుంచి 1,942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీలకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 122 మంది బదిలీపై నిర్ణయించాం.. జీవోఆర్టీ 1412 జీఏ ద్వారా అన్ని ఏర్పాట్లు చేశామని.. 122 మందిలో 61 మంది ఇప్పటికే బదిలీ అయ్యారు అని వివరించారు.
మంత్రులు.. అధికారులతో కమిటీ వేశాం
రాష్ట్ర ద్వైపాక్షిక పునర్వ్య దవస్థీకరణ సమస్యల కోసం మంత్రులు కమిటీ, సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని సభలో మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి కందుల దుర్గేష్, మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఉన్నారని.. ఇక, సీనియర్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.