Thursday, December 26, 2024

AP – పవన్ కల్యాణ్ అన్న దాంట్లో తప్పేమీ లేదు – అనిత

అమరావతి – ఏపీలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా స్పందించారు. సోమవారం పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ..రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని సూచించారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందన్న పవన్.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు

తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు.తిరుపతి లో ఆమె మీడియా తో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. తమలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. త్వరలోనే ఆయనతో మాట్లాడతా. పిఠాపురం సభలో మాట్లాడిన దానిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని నాకు తెలుసంటూ పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై అనిత వివరణ ఇచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement