Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : అందరిలోనా నెక్కుడు

రాగం : నాట

అందరిలోనా నెక్కుడు హనుమంతుడు
కందువ మతంగగిరి కాడి హనుమంతుడు || ||అందరిలోనా నెక్కుడు||

కనక కుండలాలతో కౌపీనము తోడ
జనియించినాడు యీ హనుమంతుడు
ఘన ప్రతాపముతోడ కఠిన హస్తాలతోడ
పెనుతోక యెత్తినాడు పెద్ద హనుమంతుడు || ||అందరిలోనా నెక్కుడు||

తివిరి జలధిదాటి దీపించి లంకయెల్లా
అవల యివల సేసె హనుమంతుడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతా
ధ్రువమండలము మొచే దొడ్డ హనుమంతుడు || ||అందరిలోనా నెక్కుడు||

తిరుమైన మహిమతో దివ్య తేజముతోడ
అరసిదాసుల గాచీ హనుమంతుడు
పరగ శ్రీవేంకటేశు బంటై సేవింపుచు
వరములిచ్చీ బొడవాటి హనుమంతుడు || ||అందరిలోనా నెక్కుడు||

Advertisement

తాజా వార్తలు

Advertisement