రాజ్యాంగం వల్లే దేశం బలంగా ఉందని, అంబేద్కర్ దేశానికి అధ్బుతమైన రాజ్యాంగం అందించారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన దళిత సంఘాల ఐక్య వేదిక రిజిస్ట్రేషన్ నెంబర్ 307 ఆధ్వర్యంలో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దళిత సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని, ఆయన జీవితాన్ని ప్రజాసేవకై అంకితం చేశారని గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కిషన్ రావు, చైర్మన్ మద్దెల సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ గట్టు అశోక్, వైస్ చైర్మన్ సీహెచ్ శ్యామ్, యాదగిరి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామ్, కౌన్సిలర్ జక్కుల కృష్ణా యాదవ్, కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సోమేష్ యాదవ్, ఎత్తరి మారయ్య, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..